సేపియన్స్ – మానవజాతి పరిణామక్రమం సంక్షిప్త చరిత్ర

(4 customer reviews)

599.00

సేపియన్స్ –
మానవజాతి పరిణామక్రమం సంక్షిప్త చరిత్ర
యువల్ నోహ్ హరారి

 

డెబ్బయి వేల సంవత్సరాల క్రితం భూతలం పై ఆరు వేర్వేరు మానవ జాతులు ఉండేవి. అవి సర్వ సాధారణ జంతువులు, వాటి ప్రభావం పర్యావరణం పై మిణుగురు పురుగులు, జెల్లీ చేపల కన్నా తక్కువగా ఉండేది. నేడు ఒకే ఒక మానవ  జాతి మిగిలింది, అది మనం. హోమో సేపియన్స్. అయితే భూమి ఇప్పుడు మన పాలనలో ఉంది.సేపియన్స్ పుస్తకం పరిణామ దశనుండి పెట్టుబడి దారీ వ్యవస్థ,  జన్యు సాంకేతికత వరకు మానవచరిత్రను ఉత్కంఠ భరితం గా వివరించి మనం ఎందుకు ఇలా ఉన్నామో వెలికి తీస్తుంది.

సేపియన్స్ పుస్తకం మానవ జాతి, దాని చుట్టూ వున్న ప్రపంచం రూపొందిన విధాన ప్రక్రియ పై దృష్టి పెడుతుంది. అంటే వ్యవసాయం రాకడ, సంపద సృష్టి, మత వ్యాప్తి, జాతీయ రాజ్యాల పెరుగుదల లాంటివి. ఈ రకమైన ఇతర పుస్తకాలలో ఉన్నట్టుగా కాకుండా, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సేపియన్స్  పుస్తకం చరిత్ర, జీవ శాస్త్రం, తత్వ శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం లాంటి బహుళ విషయాల మధ్య ఉన్న ఖాళీని పూరిస్తూ సాగుతుంది. ఇంకా, స్థూల మరియు సూక్ష్మ దృష్టి తో  ఎందుకు, ఎలా ఈ పరిణామాలు జరిగాయో, అవి వ్యక్తుల పై ఎలాంటి ప్రభావం చూపాయా సేపియన్స్ తెలియజేస్తుంది. సేపియన్స్ పుస్తకం గత పరిణామాలను నేటి ఆలోచనలతో అనుసందించటమే కాకుండా మనలను ప్రశ్నలు సంధించడానికి ఆహ్వానిస్తుంది.

పుస్తకం ముగింపు జ్ఞానాన్నివ్వడమేకాక కొన్ని సార్లు రెచ్చగొడుతుంది. ఉదాహరణకు :

మనం ప్రపంచాన్ని పాలిస్తున్నాము, ఎందుకంటే దేవుళ్ళు, రాజ్యాలు,  ధనం, మానవ హక్కులు లాంటి ఊహాజనిత విషయాలను విశ్వసించే మరో జంతువు మరేదీ లేదు కనుక.

సేపిఏన్లు పర్యావరణ వరుస హంతకులు. మన పూర్వీకులు వ్యవసాయం రాకముందే రాతి పనిముట్లతోనే భూమి పైని గొప్ప క్షీరదాలను తుడిచి పెట్టారు.

వ్యవసాయ విప్లవం చరిత్రలో అతి పెద్ద మోసం. గోధుమలు సేపియన్లను ఇంటికి పరిమితం చేశాయి మరో మార్గం లేకుండా.

ధనం అనేది ఇప్పటివరకు కనుగొన్న వాటిలో విశ్వజనీనమైన పరస్పర విశ్వాస సాధనం. ధనం ఒక్కటే అందరూ విశ్వసించేది.

మానవులు కనుగొన్న విజయవంతమైన రాజకీయ వ్యవస్థ సామ్రాజ్యం. ఈనాటి సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణి స్వల్పకాలిక వైకల్యం.

పెట్టుబడిదారీ విధానం ఒక ఆర్థిక సూత్రం కాదు, అది ఒక మతం. ఇప్పటి వరకు అది అత్యంత విజయవంతమైన మతం.

ఆధునిక వ్యవసాయం లో జంతువులను హింసించడం చరిత్రలో అత్యంత క్రూరమైన నేరం కావొచ్చు.
రాజ్యం మరియూ వ్యాపారం పెంపొందించిన వ్యక్తివాదం కుటుంబాలను సమాజాన్ని విచిన్నం చేస్తున్నది.

మనం మన పూర్వీకులకన్న శక్తివంతులం, అలాగని  మిక్కిలి సంతోషవంతులుగా ఏమీ లేము.

సేపియన్స్ త్వరలోనే అదృశ్యమయి పోతారు. ఆధునిక సాంకేతికత సాయంతో కొన్ని శతాబ్దాలు లేదా దశాబ్దాలలో సేపియన్లు పూర్తి భిన్నమైన జీవులుగా అభివృద్ధి చెందుతారు. దైవ లక్షణాలను, సామర్ధ్యాలను అనుభవిస్తారు. మానవులు  దైవాన్ని కనుగొనడం తో చరిత్ర ప్రారంభం అయ్యింది – మానవులు దేవుళ్ళు గా మారడంతో అది అంతం అవుతుంది.

సేపియన్స్ పుస్తకం అంతర్జాతీయంగా అత్యంత అధికంగా అమ్ముడయ్యే పుస్తకం కావడానికి ఒక చిన్న కారణం ఉంది. ఆధునిక ప్రపంచ చరిత్ర లోని అతిపెద్ద ప్రశ్నల్ని  అది పరిష్కరిస్తుంది. ఇంకా అది మరువలేనంత సరళమైన భాషలో రాశారు, మీరు దీన్ని ఇష్టపడుతారు. -జేరెడ్ డైమండ్, పులిట్జర్ బహుమతి పొందిన రచయిత ,గన్స్,జర్మ్స్ అండ్ స్టీల్ పుస్తక రచయిత

డాక్టర్ యువల్ నోవా హరారీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సి టి నుం చి చరితల్రో పి. హెచ్. డి తీసుకున్నా రు.
ప్రస్తుతం జెరూసలేమ్ హిబ్రూ యునివర్సిటిలో చేస్తున్నా రు. ప్రపంచ చరిత్ర గురిం చి పత్ర్యే కం గా సేపియన్స్ , హొమో డియూస్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుస్తకాలు రాశారు.

 పేజీలు 432  ధర రూ599

✅ 100% TAX FREE ✅ 100% REFUND POLICY ✅ 24x7 CUSTOMER CARE ✅ ASSURED HOUSE DOORSTEP DELIVERY ANYWHERE IN INDIA ✅ PERFECT FOR URBAN AND NON-URBAN BUYERS ALIKE ✅ INSTANT WHATSAPP HELPDESK AND DELIVERY STATUS UPDATE ON ENQUIRY: 91-9446808800 ✅ 8 + YEARS OF CUSTOMER SATISFACTION

Description

Sapiens: A Brief History of Humankind (Telugu) – Yuval Noah Harari

సేపియన్స్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్‌కైండ్ (తెలుగు)

4 reviews for సేపియన్స్ – మానవజాతి పరిణామక్రమం సంక్షిప్త చరిత్ర

 1. Sankaranarayanana RR

  అవును. మానవ జీవితంలో తప్పక చదవాల్సిన పుస్తకం

 2. M N Gowda

  తప్పక చదవవలసిన గొప్ప చరిత్ర పుస్తకం.

 3. VasuKonduru

  I have already bought this! Very informative and interesting! A must buy and must read!

 4. Krishna Vasa

  మంచి పుస్తకం నా దగ్గర ఉన్నది

Add a review

Your email address will not be published. Required fields are marked *