పెరియార్
₹299.00
వీరే పెరియార్
మంజై వసంతన్
“వీరే పెరియార్”, ద్రావిడ ఉద్యమ పితగా పిలుచుకునే ఒక వ్యక్తి కథ. ఆయన కన్నడ కుటుంబంలో తమిళనాటన పుట్టి తమిళనాడు ఇంకా ఇతర రాష్ట్రాల సామాజిక వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చాడు. ఆయనకు తమిళ మహిళా సంఘాలు పెరియార్, అంటే ‘తండ్రి లాంటివాడు’ అనే బిరుదు ఇచ్చాయి. వైకం పోరాట యోధుడైన ఆయనను కేరళ ప్రజలు ‘వైకం వీరుడు’ గా కీర్తిస్తారు. భారతీయులందరూ ఆధునిక చార్వాకుడైన ఈ మహనీయుని గురించి తప్పక చదవాలి.
పురుషులకు ఉండే శారీరక కోరికలు స్త్రీలకు కూడా ఉంటాయి. భర్తను కోల్పోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోకుండా ఎందుకుండాలి జీవితాంతం ? 60, 70 ఏళ్ల మగవాడు భార్య మరణిస్తే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు?
(పేజీ 78)
జాతకం నిజమే అయితే, అది చెప్పినట్టే అంతా జరుగుతున్నట్లయితే, ఎవరినైనా తప్పు పట్టడం ఎలా? వారి పనులపై వారికి బాధ్యత ఉండదు. వారు అనుకున్నట్లుగా ఏదీ జరగదు. ఒకతను హత్య చేశాడని శిక్షించడం తప్పు. ఎవరు ఏ తప్పులు చేసినా, నేరాలు చేసినా, హత్యలు చేసినా, అది వారి గ్రహాల ప్రభావమే.
(పేజీ 166)
చదువుతో వచ్చిన జ్ఞానం, ఆత్మగౌరవ భావన, హేతుబద్ధమైన ఆలోచన ఇవే అణగారిన ప్రజల్ని అభివృద్ధి పథం లో నిలిపి వారిని ఉన్నత దశకు చేరుస్తాయి.
(పేజీ 276)
Veere Periyar / Periyar
పేజీలు 302 ధర రూ299
Reviews
There are no reviews yet.