తొలి భారతీయులు
₹299.00
తొలి భారతీయులు
టోని జోసెఫ్
మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ ‘అనాది’గా అనేది అంత పూర్వకాలం కాదనిపిస్తుంది. మన పూర్వీకుల కథ తెలియజేయడానికి పత్రికా రచయిత టోనీ జోసెఫ్ 65,000 సంవత్సరాల పూర్వానికి వెళ్ళారు. అప్పుడు ఆధునిక మానవుల సమూహం లేదా హోమో సేపియన్స్,
ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో లభించిన డిఎన్ఏ సాక్ష్యాల ఆధారంగా, ఆయన భారతదేశానికి వలస వచ్చిన ఆధునిక మానవుల జాడ కనుక్కుంటారు – వారిలో ఇరాన్ నుండి క్రీ.పూ. 7000 నుండి 3000 వరకు వ్యవసాయదారులు, మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 2000 నుండి 100 వరకు వచ్చిన స్టెప్పీలు వున్నారు.
గత చరిత్రని జెనిటిక్స్, ఇతర పరిశోధనల ఆధారంగా కనుగొనే క్రమంలో జోసెఫ్, భారతీయ చరిత్రకి సంబంధించి పలు వివాదాస్పదమైన, ఇబ్బంది కల్గించే పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
ఈ పుస్తకం ఈ మధ్యకాలంలో వెలువడిన పలు డిఎన్ఏ పరిశోధనల ఆధారంగా వ్రాయబడింది. వాటితోపాటు పురావస్తు పరిశోధనలు, భాషాపరిశోధనలు వంటివాటిని పాఠకులు ఆసక్తిగా చదివేటట్టుగా వ్రాశారు. ఎంతో ప్రాముఖ్యం గడించిన ‘తొలి
భారతీయులు’ సాధికారంగా, ధైర్యంగా ఆధునిక భారతీయులకి సంబంధించిన పలు వివాదాస్పద చర్చలకి సమాధానం యిస్తుంది. అంతేకాదు, ఆధునిక భారతీయులు ఏ విధంగా ఏర్పడ్డారో తెలియజేయడంతోపాటు అతిముఖ్యమైన, కాదనలేని సత్యాలని తెలియజేస్తుంది. మనం అంతా వలసదారులం. అంతా సంకరమయినవారం.
టోని జోసెఫ్ ‘బిజినెస్ వరల్డ్’కు మాజీ సంపాదకుడు, వివిధ ప్రసిద్ధ
పత్రికలకు మరియు వార్తాపత్రికలకు రచనలు అందించి, కాలమిస్ట్ గా కూడా
పనిచేసారు. భారతీయ పూర్వచరిత్ర మీద అనేక ప్రభావవంతమైన వ్యాసాలు వ్రాసారు.
Ranga Raju Ambati (verified owner) –
సబ్జెక్ట్ / టాపిక్ నచ్చింది