భారత దేశంలో బౌద్ధ నిర్మూలన – డా. మాటూరి శ్రీనివాస్
₹129.00
భారత దేశంలో బౌద్ధ నిర్మూలన
డా. మాటూరి శ్రీనివాస్
“భారత దేశంలో బౌద్ధ నిర్మూలన”అనే పుస్తకము పేరు వినగానే గతంలో “బుద్ధుడు చారిత్రక వ్యక్తి కాదు” అనే పుస్తకాన్ని ఒక కమ్యూనిస్టు కార్యకర్త రాసిన, చదివిన గుర్తుకు వచ్చి తుళ్లి పడ్డాను. సదరు వ్యక్తి బుద్ధుడు పురాణ పురుషుడు అని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. బుద్ధుడినీ, బౌద్దాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ రాతలతో పాటు ఎన్నో రచనలను చూశాం. అయితే, ఇది ఆ కోవలోనిది కాదని కొన్ని పేజీలు చదవగానే అర్థం అయ్యింది. ఈ పుస్తకము “Annihilation of Buddhism in India” (భారత దేశంలో బౌద్ధ నిర్మూలన) అనే ఆంగ్ల మాతృకకు అనువాదం. ఆంగ్లంలో ఈ పుస్తకాన్ని రాసినవారు డి. సత్యనారాయణగారు. బౌద్ధ కట్టడాల ధ్వంసం, బౌద్ధ భిక్షువులపై జరిగిన హింసను బట్టబయలు చేయడం ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉప శీర్షికలో ప్రకటించారు రచయిత. దానికి కట్టుబడే రచన జరిగిందని చెప్పవచ్చు. దీనిని శ్రీ గుమ్మా వీరన్నగారు తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎనిమిది భిన్న అంశాలను విభిన్న రీతిలో చర్చించడం జరిగినది. అన్ని అంశాలూ బౌద్దానికి సంబంధించినవే.
– డా. మాటూరి శ్రీనివాస్
పేజీలు 220 ధర రూ129
You may also like…
-
రావిపూడి వెంకటాద్రి రచనలు – హేతువాద మానవవాదాలు : డా౹౹. గుమ్మా వీరన్న
₹499.00 Add to cart Buy nowరావిపూడి వెంకటాద్రి రచనలు – హేతువాద మానవవాదాలు : డా౹౹. గుమ్మా వీరన్న
రావిపూడి వెంకటాద్రి రచనలు – హేతువాద మానవవాదాలు
డా౹౹. గుమ్మా వీరన్న
పేజీలు 442 ధర రూ499
₹499.00
Reviews
There are no reviews yet.