హెక్టార్ గ్రాసియా, ఫ్రాన్సిస్ మీరాల్ ‘ది బుక్ ఆఫ్ ఇచిగో ఇచి’ సహ రచయితలు. జాపనీయుల పద్ధతిన జీవితాన్ని అనుక్షణమూ అత్యంత రసభరితంగా ఆస్వాదించే కళ. హెక్టార్ జపాన్ పౌరులు. ఆయన ఒక దశాబ్దం పైగా జపాన్ లో నివసిస్తున్నారు. జపాన్ లో విపరీతంగా అమ్ముడుబోయిన ‘ఎ గీక్ ఇన్ జపాన్’ రచయిత. ఫ్రాన్సెస్ స్వయంసాయక, ఉత్తేజక పుస్తకాల రచయిత్రి. ‘లవ్ ఇన్ లోయర్ కేస్’ అన్న ఆమె నవల ఇరవై భాషలలోకి అనువాదమయింది.
Popular Science Telugu
Showing all 5 results
-
ఇకిగాయ్
₹350.00 Add to cart Buy nowఇకిగాయ్
ఇకిగాయ్
హెక్టార్ గ్రాసియా, ఫ్రాన్సిస్ మీరాల్
ఆనందంగా జీవించటానికి ప్రతి ఒక్కరికీ ఒక ఇకిగాయ్ – ప్రబలంగా ప్రోత్సహించే కారణం – ఉంటుందని జాపనీయుల దృఢవిశ్వాసం. ఆ ఇకిగాయ్ ని కనుక్కోవటమే చిరకాల ఆనందమయ జీవనానికి కీలకమని ఆగ్రామంలోని చిరాయువుల అభిప్రాయం. దృఢమైన ఇకిగాయ్ తో ప్రతిరోజూ సార్ధకంగా, రసవత్తరంగా సాగుతుంది. అధికశాతం జాపనీయులు ఎన్నటికీ రిటైర్ కాకపోవటానికి మూలకారణం వారి ఇకిగాయ్.
జపాన్ లోని ఈ గ్రామంలో శతాధిక వృద్ధుల సంఖ్య అత్యధికం. రచయితలు ఈ గ్రామవాసులను ఇంటర్ వ్యూ చేశారు. వారి చిరాయుష్షుకు ఆనందానికీ వెనక ఉన్న రహస్యం కనుక్కునే ప్రయత్నం చేశారు. తద్వారా పాతకులుగా మీ ఇకిగాయ్ కనుక్కోవటానికి ఆచరణ యోగ్యమైన సాధనాలు సమకూర్చారు.₹350.00 -
తొలి భారతీయులు
₹299.00 Add to cart Buy nowతొలి భారతీయులు
తొలి భారతీయులు
టోని జోసెఫ్
మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ ‘అనాది’గా అనేది అంత పూర్వకాలం కాదనిపిస్తుంది. మన పూర్వీకుల కథ తెలియజేయడానికి పత్రికా రచయిత టోనీ జోసెఫ్ 65,000 సంవత్సరాల పూర్వానికి వెళ్ళారు. అప్పుడు ఆధునిక మానవుల సమూహం లేదా హోమో సేపియన్స్,
ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో లభించిన డిఎన్ఏ సాక్ష్యాల ఆధారంగా, ఆయన భారతదేశానికి వలస వచ్చిన ఆధునిక మానవుల జాడ కనుక్కుంటారు – వారిలో ఇరాన్ నుండి క్రీ.పూ. 7000 నుండి 3000 వరకు వ్యవసాయదారులు, మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 2000 నుండి 100 వరకు వచ్చిన స్టెప్పీలు వున్నారు.గత చరిత్రని జెనిటిక్స్, ఇతర పరిశోధనల ఆధారంగా కనుగొనే క్రమంలో జోసెఫ్, భారతీయ చరిత్రకి సంబంధించి పలు వివాదాస్పదమైన, ఇబ్బంది కల్గించే పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.
ఈ పుస్తకం ఈ మధ్యకాలంలో వెలువడిన పలు డిఎన్ఏ పరిశోధనల ఆధారంగా వ్రాయబడింది. వాటితోపాటు పురావస్తు పరిశోధనలు, భాషాపరిశోధనలు వంటివాటిని పాఠకులు ఆసక్తిగా చదివేటట్టుగా వ్రాశారు. ఎంతో ప్రాముఖ్యం గడించిన ‘తొలి
భారతీయులు’ సాధికారంగా, ధైర్యంగా ఆధునిక భారతీయులకి సంబంధించిన పలు వివాదాస్పద చర్చలకి సమాధానం యిస్తుంది. అంతేకాదు, ఆధునిక భారతీయులు ఏ విధంగా ఏర్పడ్డారో తెలియజేయడంతోపాటు అతిముఖ్యమైన, కాదనలేని సత్యాలని తెలియజేస్తుంది. మనం అంతా వలసదారులం. అంతా సంకరమయినవారం.టోని జోసెఫ్ ‘బిజినెస్ వరల్డ్’కు మాజీ సంపాదకుడు, వివిధ ప్రసిద్ధ
పత్రికలకు మరియు వార్తాపత్రికలకు రచనలు అందించి, కాలమిస్ట్ గా కూడా
పనిచేసారు. భారతీయ పూర్వచరిత్ర మీద అనేక ప్రభావవంతమైన వ్యాసాలు వ్రాసారు.పేజీలు 212 ధర రూ299₹299.00 -
పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు
₹250.00 Add to cart Buy nowపెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు
పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు
స్టీఫెన్ హాకింగ్
ప్రపంచ ప్రసిద్ధ కాస్మాలజిస్ట్, ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ అనే నంబర్ వన్ బెస్ట్ సెల్లింగ్ పుస్తక రచయిత, తన మరణానంతరం వెలువడిన ఈ పుస్తకం ద్వారా ‘విశ్వంలోని అన్నింటికన్నా పెద్ద ప్రశ్నల’ గురించిన తన తుది అభిప్రాయాలను మనకు వదిలారు.
విశ్వం ఎట్లా మొదలయింది? మానవులు భూమి మీద మనగలుగుతారా? సౌర వ్యవస్థకు అవతల బుద్ధిజీవులు ఉన్నారా? కృత్రిమజ్ఞానం మనలను ఓడిస్తుందా? తన పరిశోధన కాలం మొత్తంలోనూ స్టీఫెన్ హాకింగ్, విశ్వం గురించిన మన
అవగాహనలను విస్తరింపజేశాడు. కొన్ని మహత్తర రహస్యాలు గుట్టువిప్పాడు.
బ్లాక్ హోల్స్, ఊహాకాలం, పెక్కు చరిత్రలు లాంటి అంశాల గురించి తన ఆలోచనలను విశ్వంలోని సుదూర ప్రాంతాలకు పరుగెత్తించాడు. అయినా భూమి మీద సమస్యలకు సమాధానాలు అందించడంలో విజ్ఞానశాస్త్రం కీలకపాత్ర పోషిస్తుంది
అన్నాడు.
వాతావరణం మార్పులు, అణుయుద్ధ భయం, ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వంటి ప్రమాదకరాలయిన మార్పులవేపు ఇక ప్రస్తుతం, తన దృష్టి సారించాడు.
పెద్ద ప్రశ్నలు వాటికి చిన్న సమాధానాలు అన్నది చరిత్రలోనే సాటిలేని మెదడు నుంచి వచ్చిన చివరి పుస్తకం. విస్తృత విషయాలను గురించి, ప్రేరణాత్మకంగా, అతని సహజమయిన హాస్యం జొప్పిస్తూ, మానవజాతిగా మనం ఎదురుకుంటున్న సమస్యల గురించి, ఒక గ్రహంగా మునుముందు మనం ఎటు పోతున్నాము అన్న విషయం గురించి
హాకింగ్ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పిన పుస్తకం యిది.స్టీఫెన్ హాకింగ్ సాటిలేని సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ప్రపంచంలోనే అత్యుత్తమ మస్తిష్కంగా లెక్కింపబడ్డాడు. కేంబ్రిడ్స్ విశ్వవిద్యాలయంలో అతను ముప్ఫయి సంవత్సరాలపాటు లుకేసియన్ ప్రొఫెసర్ ఆఫ్ మాతమాటిక్స్ పదవిలో ఉన్నాడు. ఇంటర్‌నేషనల్ బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ రాశాడు.
సాధారణ పాఠకుల కొరకు అతను రాసిన పుస్తకాలు ఎ బ్రీఫర్ హిస్టరీ ఆఫ్ టైం, బ్లాక్ హోల్స్ అండ్ బేబీ యూనివర్సెస్ (వ్యాస సంకలనం), ద యూనివర్స్ ఇన్ ఎ నట్‌షెల్, ద గ్రాండ్ డిజైన్, బ్లాక్ హోల్స్ : ద బిబిసి రైత్ లెక్చర్స్. కూతురు లూసీతో కలిసి అతను పిల్లల కోసం పుస్తకాలు రాశాడు. అందులో మొదటిది జార్జెస్ సీక్రెట్ కీ టు ద యూనివర్స్.
అతను 14 మార్చ్ 2018న మరణించాడు. ఈ పుస్తకం తొలిమాట ఎడ్డీ రెడ్‌మెన్, పరిచయం ప్రొఫెసర్ కిప్ ఎస్. తోర్న్, మలిమాట లూసీ హాకింగ్ రాశారు.పేజీలు 280 ధర రూ250₹250.00 -
హోమో డెయాస్
₹499.00 Add to cart Buy nowహోమో డెయాస్
హోమో డెయాస్
యువాల్ నోఆ హరారీ
”మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది. ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.”
– యువల్ నోఆ హరారీ– హోమో సేపియన్స్ హోమో డెయూస్‌గా మారుతుంటే (లాటిన్‌లో డెయూస్ అంటే దేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం?
– పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి – స్వాభావిక ఎంపిక – తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది?
– గూగుల్ ఇంకా ఫేస్ బుక్‌లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది?
– కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్ నుండి పక్కకు తోసి ఒక పెద్ద పనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది?
– పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము?ఈ పుస్తకంలో ప్రొఫెసర్ హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలో వెతుకుతారు. హోమో డెయూస్ అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలను కొంత మనకు చూపిస్తుంది.
యువాల్ నోఆ హరారీ
మన నమ్మకాలు ఏవైనా కానీయండి, కానీ మన ప్రపంచానికి పునాదులైన వృత్తాంతాల
పైన ప్రశ్నలు వేయడాన్ని, గతంలోని సంఘటనలని వర్తమానంలోని వ్యవహారాలతో
జోడించడాన్ని, వివాదాస్పదమైన విషయాలకు భయపడకుండా ఉండటాన్ని
ప్రోత్సహిస్తూంటాను.డా. యువల్ నోఆ హరారీ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలంలో ‘చరిత్ర’లో
పి.హెచ్‌డి చేశారు. ప్రపంచ చరిత్రను లోతుగా చదివారు. ప్రస్తుతం వారు
హీబ్రూ విశ్వవిద్యాలయం, జెరూసలేంలో అధ్యాపకుడిగా ఉన్నారు. వారి పుస్తకాలు
సేపియన్స్, హోమో డెయూస్ అంతర్జాతీయ స్థాయిలో చర్చించబడ్డాయి.
21 లెసన్స్ ఫర్ ది 21 సెంచరీ, సేపియన్స్ : గ్రాఫిక్ హిస్టరీ. వీరి
పుస్తకాలు 60 భాషలలో 27.5 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. ప్రపంచంలో
ప్రభావవంతమైన మేధావులలో ఒకరిగా ఖ్యాతినార్జించారు.పేజీలు 386 ధర రూ499₹499.00 -
21వ శతాబ్దానికి 21 పాఠాలు – యువాల్ నోవా హరారీ
₹499.00 Add to cart Buy now21వ శతాబ్దానికి 21 పాఠాలు – యువాల్ నోవా హరారీ
21వ శతాబ్దానికి 21 పాఠాలు
డాక్టర్ యువాల్ నోవా హరారీ
ప్రస్తుత పరిస్థితుల గురిం చి వివరం గా, సూదూర గతం , సూదూర భవితల గురిం చిన లోతయిన అవగాహనలు, మానవ జాతి ఎదుర్కుం టున్న సమస్య ల విషయం లో మనకు సాయపడ గల పద్దతులు ఎమిటి? ప్రస్తుతం ఏం జరుగుతోం ది?
ఈనాటి మహత్తరమైన సమస్య లు, పరిష్కా ర అవకాశాలు ఏమిటి? వేటిని పట్టిం చుకోవాలి? మన పిల్లలకి ఏం నేర్పా లి? ఇలాం టి విషయాల మీద సహేతుకమైన వ్యా సాలు ఈ పుస్తకం లో ఉన్నా యి.డాక్టర్ యువాల్ నోవా హరారీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సి టి నుం చి చరితల్రో పి. హెచ్. డి తీసుకున్నా రు.
ప్రస్తుతం జెరూసలేమ్ హిబ్రూ యునివర్సి టిలో చేస్తున్నా రు. ప్రపం చ చరిత్ర గురిం చి పత్ర్యే కం గా సేపియన్స్ , హొమో డేఉస్ వం టి ప్రపం చ ప్రసిద్ధి గాం చిన పుస్తకాలు రాశారు.పేజీలు 342 ధర రూ499₹499.00